Petrol Price: హైదరాబాద్‌లోనూ సెంచరీ దాటిన పెట్రోల్ - హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు(Petrol Price) మరోసారి పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటింది. డీజిల్ ధర కూడా లీటర్‌కు రూ.95 పైకి చేరింది. దిల్లీ సహా ఇతర నగరాల్లోనూ ఇంధన ధరలు సరికొత్త రికార్డు స్థాయికి చేరాయి.
రికార్డు స్థాయికి పెట్రోల్ ధర
By
Published : Jun 14, 2021, 10:29 AM IST
|
Updated : Jun 14, 2021, 11:31 AM IST
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు(Petrol Price) ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకూ ధరలు రికార్డు స్థాయికి చేరి సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర సోమవారం 29 పైసలు పెరిగి.. రూ.96.47 వద్దకు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్‌పై 29 పైసలు పెరిగి రూ.87.33 వద్ద ఉంది.
అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి.
దేశంలోని ఇతర ప్రధాన మెట్రో నగరాల్లోనూ పెట్రోల్ ధర(Petrol Price) లీటర్‌కు 26-30 పైసల మధ్య పెరిగింది. లీటర్ డీజిల్ ధరను 28 పైసల నుంచి 32 పైసల వరకు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.