తెలంగాణ

telangana

ETV Bharat / business

వాహనదారులకు షాక్-​ మరోసారి పెరిగిన పెట్రోల్​ ధరలు

దేశంలో పెట్రోల్(Petrol price today)​, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర 25 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్​పై 30 పైసల వరకు (Diesel price today) ధర పెంచాయి చమురు మార్కెటింగ్​ సంస్థలు.

petrol price
petrol price

By

Published : Oct 5, 2021, 9:20 AM IST

Updated : Oct 5, 2021, 12:42 PM IST

దేశంలో పెట్రో ధరల బాదుడు (Petrol price hike) ఆగడం లేదు. దేశవ్యాప్తంగా మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

దిల్లీలో లీటరు పెట్రోల్ ధర లీటర్​ 25 పైసలు పెరిగి.. రూ. 102.64 వద్దకు చేరింది. డీజిల్ ధర 30 పైసలు ఎగబాకి..​ రూ.91.08గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 26 పైసలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ.106.77కు చేరుకుంది. డీజిల్ ధర 33 పైసలు పెరిగింది. దీనితో లీటర్​ డీజిల్ ధర రూ.99.37కు చేరింది.
  • విశాఖపట్నంలో (Petrol Price in Vizag) 25 పైసలు ఎగబాకిన లీటర్ పెట్రోల్ ధర.. రూ.107.65కు చేరుకుంది. డీజిల్​పై 31 పైసలు పెరిగి.. రూ.99.73కు చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 25 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్​ ధర రూ.108.92గా ఉంది. డీజిల్​ లీటర్​కు 31 పైసలు పెరిగి.. రూ.100.96 వద్ద ఉంది.

ఇతర ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు..

  • ముంబయిలో లీటరు పెట్రోల్ (Petrol price in Mumbai)​ ధర రూ. 108.64గా ఉండగా.. డీజిల్​ ధర 98.16కు చేరింది.
  • చెన్నైలో లీటరు పెట్రోల్ ధర (Petrol price in Chennai) రూ.100.2, డీజిల్​ రూ.95.56గా ఉంది.
  • కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ ధర (Petrol price in Kolkata) రూ.103.33, డీజిల్​ ధర రూ.94.14కు చేరింది.
  • బెంగళూరులో పెట్రోల్​, డీజిల్ ధరలు వరుసగా 26 పైసలు, 32 పైసల చొప్పున పెరిగాయి. దీనితో లీటర్​ పెట్రోల్​ ధర (Petrol price in Bengaluru) రూ.106.17కి చేరింది. డీజిల్ ధర లీటర్​ రూ.96.62 వద్ద ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 5, 2021, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details