దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ ధర రూ. 100 మార్కుని దాటింది.
Petrol price: మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు - కోల్కత్తలో పెట్రోల్ధర
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 17పైసలు(Petrol price) వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ ధర వంద రూపాయలను దాటింది.
పెట్రోల్, డీజిల్ ధరలు
తెలుగురాష్ట్రాల్లో పెరిగిన పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి...
- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు 35 పైసలు పెరిగి.. రూ.104.20 వద్దకు చేరింది. డీజిల్ ధర 17 పైసలు పెరిగి రూ.97.64 వద్ద కొనసాగుతుంది.
- గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.106.42 ఉండగా.. డీజిల్ రూ.99.29కు చేరింది.
- వైజాగ్‌లో పెట్రోల్ ధర లీటర్ రూ.105.23 వద్ద ఉండగా.. లీటర్‌కు డీజిల్ ధర రూ.98.13 వద్ద కొనసాగుతుంది.
మెట్రో నగరాల్లో పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి..
- దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 100.27 ఉండగా.. డీజిల్ రూ. 89.59 గా ఉంది.
- ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ. 106.31 గా ఉండగా.. డీజిల్ ధర 97.15 కు చేరింది.
- చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 101.11, డీజిల్ రూ. 94.12గా ఉంది.
- కోల్‌కత్తాలో లీటర్ పెట్రల్ ధర రూ. 100.29, డీజిల్ ధర రూ. 92.56 కు చేరింది.
Last Updated : Jul 7, 2021, 9:09 AM IST