వరుసగా నాలుగో రోజూ పెరిగిన పెట్రో ధరలు - దిల్లీలో పెట్రోల్ ధర
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ 40 పైసలు, డీజిల్ ధర 45 పైసలు పెరిగింది. వరుసగా నాలుగు రోజుల్లో పెట్రోల్ ధర (లీటర్‌పై) రూ.2.14, డీజిల్ ధర (లీటర్‌పై) రూ.2.23 పెరిగింది.
పెరిగిన పెట్రోల్ ధరలు
By
Published : Jun 10, 2020, 10:41 AM IST
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర (దిల్లీలో) 40 పైసలు పెరిగి రూ.73.40కు చేరింది. డీజిల్ ధర లీటర్‌కు 45 పైసలు పెరిగి రూ.71.62 వద్దకు చేరింది.
ఈ నాలుగు రోజుల్లో పెట్రోల్ ధర (లీటర్‌పై) రూ.2.14, డీజిల్ ధర (లీటర్‌పై) రూ.2.23 పెరిగింది.
లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు 82 రోజుల తర్వాత రోజువారీ చమురు ధరల సవరణలను ఆదివారం నుంచి పునరుద్ధరించాయి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా వరుసగా నాలుగో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.
దేశవ్యాప్తంగా ఇత ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర బుధవారం సగటున 40 పైసలు, డీజిల్ ధర 40-60 పైసల మధ్య పెరిగింది.
ప్రధననగరాల్లో ఇంధన ధరలు (లీటర్‌కు)
నగరం
పెట్రోల్
డీజిల్
హైదరాబాద్
రూ.76.09
రూ.69.98
బెంగళూరు
రూ.75.67
రూ.68.12
ముంబయి
రూ.80.44
రూ.70.38
చెన్నై
రూ.77.66
రూ.70.38
కోల్‌కతా
రూ.75.42
రూ.67.79
సుంకాల వడ్డింపు..
అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి కారణంగా విమాన ఇంధనం ఏటీఎఫ్, వంటగ్యాస్ ధరలను క్రమంగా సవరించాయి. పెట్రో ధరలపై మాత్రం మార్చి 16 నుంచి ఎలాంటి మార్పులు చేయలేదు. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను వడ్డించింది కేంద్ర ప్రభుత్వం. తొలుత రూ.3 సుంకం పెంచిన కేంద్రం, అనంతరం పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 పెంచింది.
ఆయిల్ కంపెనీలు కూడా బీఎస్-6 విధానానికి మారిన తర్వాత ఇదే సూత్రాన్ని పాటించాయి. అంతర్జాతీయంగా తగ్గిన ధరల నుంచి లాభాలను స్వీకరించి.. ఆ లాభాలను వినియోగదారులకు బదిలీ చేయలేదు. అయితే ఇటీవల పెరిగిన చమురు ధరల భారాన్ని మాత్రం వినియోగదారులపై మోపుతున్నాయి.