భారత్‌లో ఇంధన ధరల పెంపు కొనసాగుతోంది. గురువారం.. దిల్లీలో (Fuel Price Today) లీటర్ పెట్రోల్ ధర 24 పైసలు పెరగ్గా.. డీజిల్‌పై 30 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.66కు చేరగా.. డీజిల్ ధర రూ.89.88కు పెరిగింది.
మెట్రో నగరాల్లో ఇలా..
- ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర(Mumbai petrol Price Today) 23 పైసలు ఎగబాకి.. రూ.107.68కు చేరగా.. లీటర్ డీజిల్ ధర (Mumbai Diesel Price Today) 32 పైసలు పెరిగి రూ.97.49 వద్ద కొనసాగుతోంది.
- కోల్‌కతాలో లీటర్ పెట్రోల్‌పై(Kolkata petrol Price Today) 29 పైసలు పెరగడం వల్ల ధర రూ.102.15కు పెరిగింది. లీటర్ డీజిల్‌పై (Kolkata Today Diesel Price) 30 పైసలు పెరిగి.. ధర రూ.92.93కు చేరింది.
- చెన్నైలో లీటర్ పెట్రోల్‌కు(Chennai petrol Price Today) 20 పైసలు ఎగబాకి.. ధర రూ.99.34కు పెరిగింది. లీటర్ డీజిల్‌కు 28 పైసలు (Chennai Diesel Price Today) పెరిగి.. రూ.94.42 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో పెట్రోల్‌పై(Bengaluru petrol Price Today) 25 పైసలు పెరిగి.. లీటరు ధర రూ.105.15కు తాకింది. లీటర్ డీజిల్‌పై 31 పైసలు పెరిగి.. ధర రూ.95.34కు పెరిగింది.