తెలంగాణ

telangana

ETV Bharat / business

పెట్రో మంట మళ్లీ షురూ... ఏడాది గరిష్ఠానికి ధరలు - పెట్రోల్​ ధరలు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదలతో దేశీయ మార్కెట్లో పెట్రోల్​ ధరలు ఈ ఏడాది గరిష్ఠ స్థాయిని తాకాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర 12 పైసలు పెరిగి రూ.74.66కు చేరింది.

పెట్రో మంట మళ్లీ షురూ

By

Published : Nov 25, 2019, 1:14 PM IST

దేశంలో పెట్రోల్​ ధరల మంట సామాన్యులను ఇబ్బందులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల పెరుగుదలతో దేశీయ మార్కెట్లో వరుసగా నాలుగో రోజు పెట్రోల్​ ధరను పెంచాయి చమురు సంస్థలు. తాజా పెరుగుదలతో పెట్రోల్​ రేట్లు ఈ ఏడాది గరిష్ఠ స్థాయిని తాకాయి.

దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర 12 పైసలు పెరిగింది. దిల్లీతో పాటు కోల్​కతా, ముంబయిలోనూ ఇదే స్థాయిలో పెంపు ఉండగా.. చెన్నైలో పెంపు లీటరుపై 13 పైసలుగా ఉంది. అయితే.. డీజిల్​ ధరల్లో మాత్రం మార్పు కనిపించలేదు.

నాలుగు రోజుల్లో 46 పైసలు..

వరుసగా నాలుగో రోజు పెట్రోల్​ రేట్లు పెరగటం వల్ల దిల్లీలో వినియోగదారులపై 46 పైసల భారం పడింది. ప్రస్తుతం దిల్లీలో లీటరు పెట్రోల్​ రేటు రూ.74.66, కోల్​కతాలో రూ.77.34, ముంబయిలో రూ.80.32, చెన్నైలో రూ.77.62గా ఉంది.

డీజిల్​ లీటర్​కు దిల్లీలో రూ.65.73, కోల్​కతాలో రూ.68.14, ముంబయిలో రూ.69.47గా ఉంది.

అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్​ ధర సుమారు 3 డాలర్ల మేర పెరిగింది.

ఇదీ చూడండి: ఆభరణాలు ఉన్న బ్యాంక్ లాక‌ర్‌కు బీమా అవ‌స‌ర‌మా?

ABOUT THE AUTHOR

...view details