దేశవ్యాప్తంగా పెట్రోధరల మంట కొనసాగుతోంది. సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు 25 పైసల చొప్పున పెరిగాయి. స్థానిక పన్నులు కలిస్తే ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగానే ఉంటుంది. వారం రోజుల వ్యవధిలో పెట్రోల్ ధరలో 75 పైసల పెరుగుదల నమోదైంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 85 రూపాయల 95 పైసలకు చేరింది. డీజిల్ ధర 75 రూపాయలకు పెరిగింది.
వాహనదారులకు పెట్రో మోత- మళ్లీ పెరిగిన ధరలు - పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల
దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల కొనసాగుతోంది. సోమవారం లీటర్‌కు 25 పైసల చొప్పున పెరిగాయి. దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర 85 రూపాయల 95 పైసలకు చేరగా.. డీజిల్ ధర 75 రూపాయలకు పెరిగింది.
వాహనదారులకు పెట్రో మోత- మళ్లీ పెరిగిన ధరలు
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 88 రూపాయలు 37 పైసలు, డీజిల్ 81 రూపాయల 99 పైసలకు పెరిగింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 87.64, డీజిల్ 80.44గా ఉంది.
ఇదీ చదవండి :'రిపబ్లిక్ డే'కి ఈ-కామర్స్ ఆఫర్ల సందడి
Last Updated : Jan 18, 2021, 11:26 AM IST