అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం లీటర్ పెట్రోల్ ధర 22 పైసలు, డీజిల్‌పై 23 పైసలు తగ్గించినట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి. ఆరు రోజుల వ్యవధిలో ఇంధన ధరలు తగ్గటం ఇది రెండోసారి.
దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.56, డీజిల్ రూ.80.87కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.94.16, డీజిల్ రూ.88.20గా ఉంది. ముంబయిలో పెట్రోల్ ధర రూ.96.98, డీజిల్ ధర రూ.87.96, చెన్నైలో పెట్రోల్ రూ.92.66, డీజిల్ రూ.85.96కు తగ్గాయి.