తెలంగాణ

telangana

ETV Bharat / business

2 నెలల తర్వాత పెరిగిన పెట్రో ధరలు

దేశవ్యాప్తంగా శుక్రవారం పెట్రల్​, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా ధరలను సవరించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.

DIESEL PRICE TODAY
పెరిగిన పెట్రోల్ ధరలు

By

Published : Nov 20, 2020, 2:58 PM IST

దాదాపు రెండు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం లీటర్​ పెట్రోల్​పై 17 పైసల మేర ధర పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దీనితో లీటర్ పెట్రోల్ ధర దిల్లీలో రూ.81.23 వద్దకు చేరింది. లీటర్​ డీజిల్ ధర 22 పైసలు పెరిగి.. రూ.70.68 వద్ద ఉంది.

దేశవ్యాప్తంగా ఇతర మెట్రో నగరాల్లోనూ లీటర్ పెట్రోల్ ధర 14 పైసల నుంచి 19 పైసలకు, డీజిల్ ధర లీటర్​కు 20 పైసల నుంచి 25 వరకు పెరిగాయి.

మెట్రో నగరాల్లో పెట్రోల్​, డీజిల్ ధరలు ఇలా

నగరం పెట్రోల్ డీజిల్
హైదరాబాద్ రూ.84.50 రూ.77.13
బెంగళూరు రూ.83.95 రూ.74.92
ముంబయి రూ.87.95 రూ.77.12
కోల్​కతా రూ.82.82 రూ.74.25
చెన్నై రూ.84.33 రూ.76.18

ధరల పెంపు ఎందుకు?

కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతమవుతున్నట్లు వస్తున్న వార్తలు.. అంతర్జాతీయంగా చమురు ధరల సూచీలకు కలిసొచ్చాయి. దీనితో క్రమంగా పెరుగుతున్న ధరల ఆధారంగా.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. వచ్చే వారం కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల నమోదవ్వచ్చని వెల్లడించాయి.

ఇదీ చూడండి:ఓలా 'ఈ-స్కూటర్లు' వచ్చేస్తున్నాయ్​!

ABOUT THE AUTHOR

...view details