తెలంగాణ

telangana

ETV Bharat / business

15వ రోజూ పెట్రో మంట.. నేటి ధరలు ఇవే

దేశీయంగా పెట్రో మంట కొనసాగుతోంది. వరుసగా 15వ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. 15 రోజుల్లో పెట్రోల్ ధర(లీటర్​) రూ.7.97, డీజిల్ ధర (లీటర్)​ రూ.8 పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

petro rates hike
పెరిగిన పెట్రోల్ ధరలు

By

Published : Jun 21, 2020, 10:26 AM IST

వరుసగా 15వ రోజూ పెట్రోల్​, డీజిల్ ధరలు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర 30 నుంచి 35 పైసలు పెరిగింది. డీజిల్ ధర 60 పైసల వరకు పెరిగింది. 15 రోజుల్లో పెట్రోల్ ధర మొత్తం రూ.7.97 పెరగ్గా.. డీజిల్ ధర లీటర్​పై రూ.8 పెరిగింది.

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

నగరం పెట్రోల్(లీ) డీజిల్ (లీ)
దిల్లీ రూ.79.27 రూ.78.31
హైదరాబాద్ రూ.82.23 రూ.76.48
బెంగళూరు రూ.81.78 రూ.74.41
ముంబయి రూ.86.02 రూ.76.67
చెన్నై రూ.82.56 రూ.75.79
కోల్​కతా రూ.80.93 రూ.73.60

ఇదీ చూడండి:గడువు ముగుస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?

ABOUT THE AUTHOR

...view details