పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో.. లీటర్ పెట్రోల్ ధర గురువారం 17 పైసలు పెరిగి రూ.82.66 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్కు 19 పైసలు పెరిగి రూ.72.85గా ఉంది.
దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు 15-18 పైసల వరకు, డీజిల్ ధరలు 18-20 పైసల వరకు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడిచమురు ధర ప్రస్తుతం 48.12 డాలర్లగా ఉంది.