దేశంలో ఇంధన ధరల పెంపు కొనసాగుతోంది. మంగళవారం దిల్లీలో (Fuel Price Today) లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు పెరగ్గా.. డీజిల్‌పై 25 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.42కు చేరగా.. డీజిల్ ధర రూ. 89.58కు పెరిగింది.
మెట్రో నగరాల్లో ఇలా..
- ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర(Mumbai petrol Price Today) 18 పైసలు ఎగబాకి.. రూ.107.45కు చేరగా.. లీటర్ డీజిల్ ధర (Mumbai Diesel Price Today) 27 పైసలు పెరిగి రూ.97.17 వద్ద కొనసాగుతోంది.
- కోల్‌కతాలో లీటర్ పెట్రోల్‌పై(Kolkata petrol Price Today) 22 పైసలు పెరగడం వల్ల ధర రూ.101.86కు చేరింది. లీటర్ డీజిల్‌పై (Kolkata Today Diesel Price) 25 పైసలు పెరిగి.. ధర రూ. 92.63కు పెరిగింది.
- చెన్నైలో లీటర్ పెట్రోల్‌కు(Chennai petrol Price Today) 17 పైసలు ఎగబాకి.. ధర రూ.99.14కు పెరిగింది. లీటర్ డీజిల్‌కు 24 పైసలు (Chennai Diesel Price Today) పెరిగి రూ.94.14 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో పెట్రోల్‌పై(Bengaluru petrol Price Today) 19 పైసలు పెరిగి.. లీటరు ధర రూ.104.9కు పెరిగింది. లీటర్ డీజిల్‌పై 27 పెరిగి.. ధర రూ.95.03కు పెరిగింది.