తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇరాన్​ సెగ: పెట్రోల్, డీజిల్ ధరల భగభగ - పెరిగిన పెట్రోల్, డీజిల్​ ధరలు

అమెరికా-ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం భారత్​పైనా పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగాయి.

Petrol, diesel prices continue to rise on Tuesday
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్​ ధరలు

By

Published : Jan 7, 2020, 12:53 PM IST

అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల ప్రభావం భారత్​పైనా పడింది. మంగళవారం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు, డీజిల్​ ధర 12 పైసలు చొప్పున పెరిగాయి.

ప్రధాన నగరాల్లో..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్​ వెబ్​సైట్​ ప్రకారం... లీటర్​ పెట్రోల్ ధర దిల్లీలో రూ.75.74, కోల్​కత్తాలో రూ.78.33, ముంబయిలో రూ.81.33, చెన్నైలో రూ.78.69గా ఉంది. లీటర్​ డీజిల్​ ధర... దిల్లీలో రూ.68.79, ముంబయిలో రూ.72.14, కలకత్తాలో రూ.71.15, చెన్నైలో రూ.72.69గా ఉంది.

భగభగలు

2020 సంవత్సరం మొదటి ఏడు రోజుల్లోనే పెట్రోల్​ ధర 60 పైసలు, డీజిల్ ధర 83 పైసలు పెరగడం గమనార్హం.

గల్ఫ్​ ఉద్రిక్తతలే కారణం

ఇరాన్​ కమాండర్​ సులేమానిని అమెరికా భద్రతాదళాలు హతమార్చిన నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

ఇదీ చూడండి:కేంద్రానికి చుక్కెదురు.. 'ఆర్​కామ్​'కు రూ.104 కోట్లు రీఫండ్​!

ABOUT THE AUTHOR

...view details