పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ ధర గురువారం (దిల్లీలో) 25 పైసలు పెరిగి రూ.87.85 వద్దకు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్ రూ.78.03 వద్ద ఉంది.
పెట్రో మంట.. మూడోరోజూ పెరిగిన ధరలు - today petrol price in delhi
పెట్రోల్ ధరలు వరుసుగా మూడోరోజూ పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర బుధవారం 25 పైసలు పెరిగింది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.94 దాటింది. డీజిల్ ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి.
![పెట్రో మంట.. మూడోరోజూ పెరిగిన ధరలు PETROL DIESEL PRICES AT FRESH HIGHS PETROL CROSSES RS 87 MARK IN DELHI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10578465-662-10578465-1613015300238.jpg)
పెట్రో వాత.. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు
ముంబయిలో పెట్రోల్ ధర(లీటర్కు) ఏకంగా రూ.94.36కు పెరిగింది. లీటర్ డీజిల్ ధర రూ.84.94గా ఉంది. ముంబయిలో లీటర్ డీజిల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.
దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు 25 పైసల వరకు పెరిగాయి. డీజిల్ ధర 30 పైసల మధ్య పెరిగింది.