తెలంగాణ

telangana

ETV Bharat / business

రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్ ధరలు - పెరిగిన పెట్రోల్​ ధరలు

పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్ ధర బుధవారం 35 పైసలు పెరిగి.. సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. ముంబయిలో లీటర్ పెట్రోల్​ ధర ఏకంగా రూ.93 దాటింది. డీజిల్ ధరలు కూడా పెరిగాయి.

Petrol, diesel prices at fresh highs; petrol crosses Rs 87 mark in Delhi
వాహనదారులకు షాక్​- రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు

By

Published : Feb 9, 2021, 11:37 AM IST

Updated : Feb 9, 2021, 11:51 AM IST

పెట్రోల్​, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. మూడు రోజుల విరామం తర్వాత లీటర్ పెట్రోల్ ధర మంగళవారం (దిల్లీలో) 35 పైసలు పెరిగి రూ.87.30 వద్దకు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్​ రూ.77.48 వద్ద ఉంది.

ముంబయిలో పెట్రోల్ ధర(లీటర్​కు) ఏకంగా రూ.93.83కు పెరిగింది. లీటర్ డీజిల్ ధర రూ.84.36గా ఉంది. ముంబయిలో లీటర్​ డీజిల్​ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు 25 పైసల నుంచి 30 పైసల వరకు పెరిగాయి. డీజిల్ ధర 24-28 పైసల మధ్య పెరిగింది.

ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు (లీటర్​కు)

నగరం పెట్రోల్ డీజిల్
హైదరాబాద్ రూ.90.76 రూ.84.5
బెంగళూరు రూ.90.19 రూ.82.11
ముంబయి రూ.93.83 రూ.84.36
చెన్నై రూ.89.68 రూ.82.64
కోల్​కతా రూ.88.61 రూ.81.05

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లను సవరించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.

ఇదీ చూడండి: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Last Updated : Feb 9, 2021, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details