దాదాపు 80 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ సడలింపులకు తోడు ముడి చమురు ధర బ్యారెల్కు 40 డాలర్లపైకి చేరిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్పై లీటర్కు 60 పైసలు ధర పెంచాయి. చివరి సారిగా మార్చి 16న దేశీయంగా ధరలు సవరించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకం, వ్యాట్ పెంచడం వల్ల గడిచిన 80 రోజుల్లో పలు మార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.