తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుసగా రెండోరోజు పెరిగిన పెట్రోల్​ ధరలు - petro rates hiked in india news

దేశ వ్యాప్తంగా వరుసగా రెండో రోజు పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి. శనివారం లీటరు పెట్రోల్​పై 15పైసలు, డీజిల్​పై 20పైసలు పెంచాయి చమురు సంస్థలు.

Petrol, diesel price hiked for second day in a row
వరుసగా రెండోరోజు పెట్రో మంట

By

Published : Nov 21, 2020, 6:26 PM IST

Updated : Nov 21, 2020, 6:34 PM IST

దేశవ్యాప్తంగా వరుసగా రెండోరోజు పెట్రోల్​, డీజిల్ ధరలను పెంచాయి చమురు సంస్థలు. శనివారం లీటరు పెట్రోల్ పై 15పైసలు, డీజిల్​పై 20పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్​ రేటు లీటరుకు రూ. 81.23 నుంచి 81.38కు పెరిగింది. డీజిల్ రేటు లీటరుకు రూ.70.68నుంచి 70.88కు ఎగబాకింది.

ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ.87.92నుంచి 88.09కు పెరిగింది. డీజిల్​ ధర 77.11నుంచి 77.34గా ఉంది. వ్యాట్​ను బట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధర ఉంటుంది.

ఇదీ చదవండి :మళ్లీ పెట్రో వాత.. లీటరుపై 11 పైసలు పెంపు

Last Updated : Nov 21, 2020, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details