వరుసగా రెండో రోజూ పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 60 పైసలు పెంచాయి దేశీయ చమురు సంస్థలు. ఫలితంగా దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 72.46కు చేరుకోగా డీజిల్ ధర రూ.70.59కి పెరిగింది.
ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలు 83 రోజుల విరామం తర్వాత రోజువారీ సవరణలను ఆదివారం నుంచి పునరుద్ధరించాయి. తొలి రోజూ పెట్రోల్, డీజిల్‌పై 60పైసలను పెంచాయి ఆయిల్ కంపెనీలు.
సుంకాల వడ్డింపు..
అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి కారణంగా విమాన ఇంధనం ఏటీఎఫ్, వంటగ్యాస్ ధరలను క్రమంగా సవరించాయి. పెట్రో ధరలపై మాత్రం మార్చి 16 నుంచి ఎలాంటి మార్పులు చేయలేదు. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను వడ్డించింది ప్రభుత్వం.
తొలుత రూ.3 పెంచిన కేంద్రం, అనంతరం పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 విధించాయి. ఆయిల్ కంపెనీలు కూడా బీఎస్-6 విధానానికి మారిన తర్వాత ఇదే సూత్రాన్ని పాటించాయి. అంతర్జాతీయంగా తగ్గిన ధరల నుంచి లాభాలను స్వీకరించి పెట్రో ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.
ఇదీ చూడండి:80 రోజుల తర్వాత పెట్రోల్ ధరలు పెంపు