తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆగిన 'పెట్రో' మోత.. ధరల పెంపునకు బ్రేక్​ - దేశంలో ఇంధన ధరలు

దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఇంధన ధరలకు (Fuel Price Today) బ్రేక్​ పడింది. గత కొద్ది రోజులుగా చమురు ధరలను పెంచూతూ వస్తున్న సంస్థలు.. సోమవారం కాస్త విరామం ఇచ్చాయి.

petrol
ఆగిన 'పెట్రో' మోత.. ధరల పెంపునకు బ్రేక్​!

By

Published : Oct 25, 2021, 8:56 AM IST

గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న చమురు ధరల (Fuel price Today) పెంపునకు సోమవారం కాస్త బ్రేక్​ పడింది. పెట్రోల్​, డీజిల్​పై సగటున రోజుకు 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు ప్రకటిస్తూ వచ్చిన చమురు సంస్థలు.. పెంపుపై సోమవారం ఎలాంటి ప్రకటన చేయలేదు.

18 నెలల వ్యవధిలో పెట్రోల్​ ధర (Fuel price Today) లీటర్​కు రూ.36, డీజిల్​పై లీటర్​కు రూ.26.58 మేర పెరిగింది.

ప్రస్తుతం దేశ రాజధానిలో లీటర్​ పెట్రోల్ ధర​ రూ.107.59 ఉండగా, లీటర్​ ​డీజిల్​ ధర రూ. 96.33 వద్ద కొనసాగుతోంది.

మెట్రో నగరాల్లో ఇలా..

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర (Mumbai Diesel Price Today) రూ.113.42కు చేరగా.. లీటర్​ డీజిల్​​ ధర రూ.104.34 వద్ద కొనసాగుతోంది.
  • కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ (Kolkata Today Diesel Price) ధర రూ.108.07గా ఉంది. లీటర్​ డీజిల్ ధర రూ.99.40 వద్ద కొనసాగుతోంది.
  • చెన్నైలో లీటర్​ పెట్రోల్​ (Chennai Diesel Price Today) ధర రూ.104.49 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర రూ.100.55కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.111.87కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.105.04 కి చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్​కు రూ.113.89కి చేరింది. డీజిల్​పై 35 పైసలు పెరిగి​ లీటర్ రూ.106.46 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.112.62 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.105.23కి చేరింది.

ఇదీ చూడండి :14 ఏళ్ల తర్వాత పెరగనున్న అగ్గిపెట్టె ధర!

ABOUT THE AUTHOR

...view details