తెలంగాణ

telangana

ETV Bharat / business

Fuel Price Today: పెట్రో మోత- మళ్లీ పెరిగిన చమురు ధరలు - గుంటూరులో పెట్రోల్​ ధరలు

దేశంలో ఇంధన ధరలు (Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

PETROL AND DIESEL PRICES TODAY
పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలు

By

Published : Oct 23, 2021, 8:22 AM IST

ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా పెట్రోల్​, డీజిల్​పై(Fuel price Today) మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

దిల్లీలో పెట్రోల్​, డీజిల్​ ధరలు 35 పైసలు పెరిగాయి. లీటర్​ పెట్రోల్​ ధర రూ.107.24కు చేరగా.. డీజిల్​ ధర రూ.95.98కు పెరిగింది.

మెట్రో నగరాల్లో ఇలా..

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర (Mumbai Diesel Price Today) 35 పైసలు పెరిగి రూ.113.08కు చేరగా.. లీటర్​ డీజిల్​​ ధర 35 పైసలు పెరిగి రూ.104.00 వద్ద కొనసాగుతోంది.
  • కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ (Kolkata Today Diesel Price) ధర రూ.107.74గా ఉంది. లీటర్​ డీజిల్ ధర రూ.99.05 వద్ద కొనసాగుతోంది.
  • చెన్నైలో లీటర్​ పెట్రోల్​ (Chennai Diesel Price Today) ధర 35 పైసలు పెరిగి రూ.104.19 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర 35 పైసలు​ రూ.100.22కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. ఫలితంగా లీటర్ రూ.111.51కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 35 పైసలు అధికమై.. లీటర్​ రూ.104.66 కి చేరింది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 35 పైసలు పెరిగి.. లీటర్​ రూ.113.54కి చేరింది. డీజిల్​పై 35 పైసలు పెరిగి​ లీటర్ రూ.106.09 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.112.27 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.104.86కి చేరింది.

ఇదీ చూడండి:Phonepe News: యూజర్లకు ఫోన్​పే షాక్​- వాటిపై ఛార్జీలు

ABOUT THE AUTHOR

...view details