దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్ ధర రూ.93.94 కు చేరింది. డీజల్ ధర రూ.84.89గా ఉంది.
ఈనెలలో 15వ సారి పెరిగిన చమురు ధరలు - మే నెలలో పెరిగిన పెట్రోల్ ధర
దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.93.94కి చేరింది. ఒక్క మే నెలలోనే 15 సార్లు ఇంధన ధరలు పెరిగాయి.
పెట్రోల్ ధరలు, డీజిల్ ధరల
మే నెలలో ముడి చమురు ధరలు పెరగడం ఇది 15వ సారి కావడం గమనార్హం. ఈ పక్షం రోజుల్లో పెట్రోల్‌పై రూ.3.54, డీజిల్‌పై రూ.4.16 పెంచాయి సంస్థలు. మరో వైపు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ముంబయిలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100.19, రూ.92.17గా ఉన్నాయి.
ఇదీ చూడండి:ముడిచమురు ఎగుమతుల్లో ఆసియా దేశాలకు సౌదీ కోత