దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి ఆల్‌టైం రికార్డ్ స్థాయికి చేరువయ్యాయి. 29 రోజుల విరామం తర్వాత దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర బుధవారం 26 పైసలు పెరిగి.. రూ.83.97 వద్దకు చేరింది. 2018 అక్టోబర్ 4న పెట్రోల్ ధర లీటర్ రూ.84 వద్దకు చేరి జీవనకాల రికార్డ్ స్థాయిని తాకింది.
దిల్లీలో డీజిల్ ధర కూడా బుధవారం లీటర్‌పై 25 పైసలు పెరిగి.. రూ.74.12 వద్దకు చేరింది.
దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లోనూ పెట్రోల్ ధర లీటర్‌కు 25 పైసల నుంచి 29 పైసల మధ్య పెరిగింది. డీజిల్ ధర లీటర్‌పై 26 పైసల నుంచి 30 పైసల వరకూ పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ప్రధన నగరాల్లో ఇంధన ధరలు (లీటర్‌కు)
నగరం | పెట్రోల్ | డీజిల్ |
హైదరాబాద్ | రూ.87.31 | రూ.80.86 |
బెంగళూరు | రూ.86.76 | రూ.78.56 |
ముంబయి | రూ.90.57 | రూ.80.76 |
చెన్నై | రూ.86.73 | రూ.79.44 |
కోల్‌కతా | రూ.85.42 | రూ.77.68 |