ఇంధన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గురువారం లీటరుకు 18 నుంచి 31 పైసలు పెంచాయి ప్రభుత్వ చమురు సంస్థలు.
మూడో రోజూ ఇంధన ధరల మంట - ముంబయిలో పెట్రోల్ ధర
దేశంలో ఇంధన ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. దిల్లీలో లీటరు పెట్రోల్‌పై రూ.25 పైసలు పెరిగింది. ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ.97.34కి చేరింది.
మూడో రోజూ ఇంధన ధరల మంట
దిల్లీలో లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగింది. ఫలితంగా లీటరు పెట్రోలు ధర రూ.90.99కి చేరింది. డీజిల్ రూ.81.42కి పెరిగింది.
నగరం | పెట్రోల్ | డీజిల్ |
ముంబయి | రూ.97.34 | రూ.88.49 |
చెన్నై | రూ.92.90 | రూ.86.35 |
కోల్‌కతా | రూ.91.14 | రూ.84.26 |
ఇదీ చదవండి:'విద్యుత్తు'పై మానవ తప్పిదాలతో మహాముప్పు