దేశంలో పెట్రో బాదుడు కొనసాగుతోంది. వరుసగా 11వ రోజూ ఇంధన ధరలు భగ్గుమన్నాయి. దేశ రాజధానిలో పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం.. దిల్లీలో లీటరు పెట్రోల్ రూ.90.19 ఉండగా.. లీటరు డీజిల్ రూ. 80.60గా ఉంది.
వరుసగా 11వ రోజూ 'పెట్రో' బాదుడు - Latest news on fuel price
రోజుకో స్థాయిలో పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కులు చూపిస్తున్నాయి. వరుసగా 11వ రోజూ ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్(దిల్లీలో)పై 31 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.93.76కు చేరింది.
భగ్గుమంటోన్న పెట్రోల్ ధరలు- వరుసగా 11వ రోజూ పెంపు
ఇక.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 33పైసలు పెరిగి.. రూ.93.76కు ఎగబాకింది. లీటరు డీజిల్‌పై 36 పైసలు వృద్ధి చెంది.. రూ.87.89లకు చేరింది. తాజా పెంపుతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 13 సార్లు చమురు ధరలు పెరిగాయి. ఇలా రోజుకోస్థాయిలో ఇంధన రేట్లు పెరుగుతుండటం వల్ల సామాన్యుడి తలపై మరింత భారం పడుతోంది.
ఇదీ చదవండి:2-3 ఏళ్లలో తక్కువ ధరకే విద్యుత్ కారు