వాహనదారులకు షాక్- రెండో రోజూ పెట్రో మోత - హైదరబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర
దేశంలో మళ్లీ పెట్రో బాదుడు షురువైంది. వరుసగా రెండో రోజూ (బుధవారం) పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు, డీజిల్ ధర లీటర్‌కు 21 పైసలు పెరిగాయి.
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
By
Published : May 5, 2021, 8:15 AM IST
|
Updated : May 5, 2021, 9:25 AM IST
దేశవ్యాప్తంగా వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర బుధవారం 19 పైసలు పెరిగి.. రూ.90.80 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర 21 పైసలు పెరిగింది. దీనితో లీటర్ డీజిల్ ప్రస్తుతం రూ.81.18 వద్ద ఉంది.
అంతర్జాతీయంగా ముండి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి.
దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లోనూ.. పెట్రోల్ ధర లీటర్‌కు 16-20 పైసల వరకు పెరిగింది. లీటర్ డీజిల్ ధరను కూడా 20 నుంచి 23 పైసలకు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.