తెలంగాణ

telangana

ETV Bharat / business

Fuel Price Today: 'పెట్రో' మోత.. మరోసారి ధరల పెంపు - హైదరాబాద్​లో పెట్రోల్​ ధర

దేశంలో ఇంధన ధరలు (Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​పై 37 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

fuel price today
పెట్రోల్​ ధరలు

By

Published : Nov 2, 2021, 7:10 AM IST

దేశంలో చమురు ధరల పెంపు ఆగడం లేదు. తాజాగా లీటర్​ పెట్రోల్​పై 37 పైసలు పెంచుతున్నట్లు (Fuel price Today) చమురు సంస్థలు ప్రకటించాయి.

దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.110.08కు చేరగా.. డీజిల్​ ధర రూ.98.44కు పెరిగింది.

మెట్రో నగరాల్లో ఇలా..

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర 36 పైసలు పెరిగి (Mumbai Petrol Price Today) రూ.115.83కు చేరగా.. లీటర్​ డీజిల్ ​రూ.106.59 వద్ద కొనసాగుతోంది.
  • కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ (Kolkata Petrol Price) ధర 35 పైసలు పెరిగి రూ.110.47గా ఉంది. లీటర్​ డీజిల్ ధర రూ.101.53గా ఉంది.
  • చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర 32 పైసలు పెరిగి (Chennai Petrol Price) రూ.106.65 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర రూ.102.57 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Hyderabad Petrol Price Today) లీటర్ పెట్రోల్​ ధర 38 పైసలు పెరిగి రూ.114.47కు చేరుకుంది. మరోవైపు లీటర్ డీజిల్​ ధర రూ.107.37గా ఉంది.
  • గుంటూరులో (Guntur Petrol Price) పెట్రోల్ ధర లీటర్​కు 37 పైసలు పెరిగి రూ.116.43కి చేరింది. డీజిల్​పై ధర​ లీటర్ రూ.108.71 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Vizag Petrol Price Today) లీటర్ పెట్రోల్ ధర 37 పైసలు పెరిగి రూ.115.13కి చేరగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.107.45కి చేరింది.

ఇదీ చూడండి :ఈపీఎఫ్​ఓ యూఏఎన్​ నెంబరు మర్చిపోయారా? అయితే ఇలా చేయండి!

ABOUT THE AUTHOR

...view details