పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ ప్రకటించిన కేంద్రం.. రాష్ట్రాలనూ వ్యాట్ తగ్గించాలని కోరింది. లీటరు పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున కేంద్రం తగ్గించగా.. రాష్ట్రాలు సైతం భారీగా తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అత్యధికంగా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను(ప్రతి లీటరుకు) రూ.12 మేర తగ్గించింది. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ.. యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
దేశంలోని వివిధ రాష్ట్రాలు విలువ ఆధారిత పన్నును లీటరుకు ఏమేర తగ్గించాయో తెలిపే పట్టికను ఓసారి చూడండి..
రాష్ట్రం | పెట్రోల్ | డీజిల్ |
ఉత్తర్‌ప్రదేశ్ | రూ.12 | రూ.12 |
త్రిపుర | రూ.7 | రూ.7 |
సిక్కిం | రూ.7 | రూ.7 |
కర్ణాటక | రూ.7 | రూ.7 |
హరియాణా | రూ.7 | రూ.7 |
గోవా | రూ.7 | రూ.7 |
హిమాచల్ ప్రదేశ్ | రూ.7 | రూ.7 |
మిజోరం | రూ.7 | రూ.7 |
పుదుచ్చేరి | రూ.7 | రూ.7 |
అసోం | రూ.7 | రూ.7 |
గుజరాత్ | రూ.7 | రూ.7 |
మణిపుర్ | రూ.7 | రూ.7 |
అరుణాచల్ ప్రదేశ్ | రూ.5 | రూ.5 |
గోవా | రూ.5.47 | రూ.4.38 |
రాజస్థాన్ | రూ.6.35 | ---- |
ఒడిశా | ---- | రూ.12.88 |
ఉత్తరాఖండ్ | రూ.2 | --- |
దిల్లీ | రూ.1 | రూ.1.75 |