కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లకు 'ఇండియా పోస్ట్' గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు తమ సమీపంలోని పోస్టాఫీసుల ద్వారా జీవన్ ప్రమాణ్ సేవలు పొందొచ్చని వెల్లడించింది. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికెట్‌ను సమీపంలోని పోస్టాఫీసుల ద్వారా సులభంగా పొందొచ్చని తెలిపింది.
టెక్నాలజీ గురించి పెద్దగా అవగాహన లేని వృద్ధులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. ఇప్పటి వరకు లైఫ్ సర్టిఫికెట్ పొందేందుకు పెన్షన్ ఖాతా ఉన్న బ్యాంకులకు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అయితే తాము పని చేసిన సంస్థ కార్యాలయానికి వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ పొందాల్సి వచ్చేది.
ఇప్పుడు ఇండియా పోస్ట్ లైఫ్ సర్టిఫికెట్ అందించే సేవలు ప్రారంభించడం వల్ల 60 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. భారీ సంఖ్యలో రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత పెన్షనర్లకు ఊరట లభించనుంది.
ఏమిటీ లైఫ్ సర్టిపికెట్..?
పెన్షన్‌దారుడు జీవించి ఉన్నారని తెలిపేందుకు ఉద్దేశించినదే ఈ లైఫ్ సర్టిఫికెట్. ఇది బయోమెట్రిక్‌తో కూడిన ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. ఆధార్, బయోమెట్రిక్‌ను ఉపయోగించి దీనిని పొందవచ్చు.