పెన్షనర్లకు హై అలర్ట్! పెన్షన్‌ను యథావిధిగా పొందాలంటే ప్రతి ప్రభుత్వ పెన్షన్‌దారు.. వార్షిక జీవిత ధ్రువీకరణ (లైఫ్ సర్టిఫికేట్) పత్రాన్ని (Pensioners Life Certificate 2021) సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్‌లో ఈ సర్టిఫికేట్‌ను (Pensioners Life Certificate) సమర్పించకపోతే.. పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది! 80 ఏళ్లు పైబడిన వ్యక్తులు అక్టోబర్ 1 నుంచే లైఫ్ సర్టిఫికేట్లను సమర్పిస్తున్నారు. వీడియో కాల్ ద్వారా కూాడా ఈ సర్టిఫికేట్ సమర్పించే అవకాశం ఉంది.
ఎలా సమర్పించవచ్చంటే..
లైఫ్ సర్టిఫికేట్‌ను (Pensioners Life Certificate 2021) సమర్పించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇలా..
- పెన్షన్ అందిస్తున్న బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్లి సమర్పించవచ్చు.
- జీవన్ ప్రమాణ్ పోర్టల్‌లోకి వెళ్లి ఆధార్ ద్వారా డిజిటల్ రూపంలో లైఫ్ సర్టిఫికేట్ (Pensioners Life Certificate online) అందించొచ్చు.
- బ్యాంకింగ్ డోర్‌స్టెప్ ఫెసిలిటీ ద్వారా కూడా సర్టిఫికేట్ (Pensioners Life Certificate form) సమర్పించవచ్చు. దీనికోసం 'డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్'లో వివరాలు నమోదు చేసుకొని పెన్షన్ అకౌంట్ నెంబర్‌ను ధ్రువీకరించాలి. కనీస రుసుముతో ఈ పని అయిపోతుంది. బ్యాంకు ప్రతినిధులే మీ ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ప్రక్రియను పూర్తి చేస్తారు.
- పోస్ట్‌మ్యాన్ ద్వారా ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఇందుకోసం పోస్ట్ ఇన్పో మొబైల్ యాప్ లేదా ప్రభుత్వ వెబ్‌సైట్‌కి వెళ్లి డోర్‌స్టెప్ రిక్వెస్ట్ కోసం నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మొబైల్‌కు 'ప్రమాణ్ ఐడీ' వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ వెసులుబాటు ఉంది. ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా సరే.. ఈ సేవను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం రూ.70 చెల్లించాల్సి ఉంటుంది.