తెలంగాణ

telangana

ETV Bharat / business

కరెంట్ బిల్, రీఛార్జ్​ కోసం ప్రతినెలా రూ.1000 లోన్​! - పేటీఎం పోస్ట్​పెయిడ్​ మినీ

కరెంట్​ బిల్ కట్టాల్సిన చివరి తేదీ వచ్చేసిందా? మొబైల్ డేటా ప్యాక్​ గడువు తీరిపోతుందా? అయినా సమయానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారా? మీలాంటి వారికోసమే ఓ బంపర్ ఆఫర్ ఇస్తోంది పేటీఎం. యుటిలిటీ బిల్లులను సమయానికి చెల్లించేందుకు వీలుగా రూ.1000 వరకు రుణం ఇస్తోంది. ఆ వివరాలు మీకోసం...

Paytm Offers
పేటిఎం పోస్ట్​పెయిడ్​ మినీ లోన్​

By

Published : Jul 8, 2021, 4:57 PM IST

ఫిన్​టెక్​ దిగ్గజం, ప్రముఖ పేమెంట్​ సంస్థ పేటీఎం(Paytm).. తమ వినియోగదారులకు సరికొత్త ఆఫర్​ ప్రకటించింది. 'బై నౌ పే లేటర్​(బీఎన్​పీఎల్​)' సేవల్లో భాగంగా 'పోస్ట్​పెయిడ్​ మినీ'(Paytm postpaid mini) పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్​ ద్వారా నెలవారీ ఇంటి ఖర్చుల కోసం.. ఇన్​స్టంట్​​ లోన్​ సౌకర్యం లభించనుంది. ​ఈ సేవలను బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఆదిత్య బిర్లా ఫైనాన్స్​ లిమిటెడ్​ భాగస్వామ్యంతో ప్రారంభించింది పేటీఎం. ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత ఇన్​స్టంట్​ క్రెడిట్​ 'పేటీఎం పోస్ట్​పెయిడ్​'కు ఇది అదనం.

కొత్త ఆఫర్​ ఇలా..

ఈ కొత్త సేవల ద్వారా పేటీఎం వినియోగదారులు రూ.250 నుంచి రూ.1000 వరకు నెలనెలా రుణం పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ ఆఫర్​ రోజువారీ ఖర్చులతో పాటు మొబైల్​, డీటీహెచ్​ రీఛార్జులు, గ్యాస్​ సిలిండర్​ బుకింగ్​, విద్యుత్తు, నీటి బిల్లుల వంటి నెలవారీ ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడతుందని పేటీఎం పేర్కొంది.

ఈ కొత్త ఫీచర్​ ద్వారా రుణాలు పొందితే 30 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల రోజుల కాలానికి ఎలాంటి వడ్డీ ఉండదు. అలాగే.. ఎలాంటి యాక్టివేషన్​ ఛార్జీలు, వార్షిక ఫీజులు, కనీస నగదు నిల్వ కూడా అవసరం లేదని స్పష్టం చేసింది పేటీఎం.

ఆర్థిక క్రమశిక్షణను దోహదం..

కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలో తమ సంస్థ నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేశారు పేటీఎం సీఈఓ భవేశ్​ గుప్తా. 'ప్రజలు వారి క్రెడిట్​ ప్రయాణాన్ని ప్రారంభించటానికి, ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించటానికి మేము సహాయం చేయలనుకుంటున్నాం. పోస్ట్​పెయిడ్​ ద్వారా మేము ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచటానికి ప్రయత్నాలు చేపట్టాం. మా కొత్త పోస్ట్​పెయిడ్​ మినీ సర్వీస్​ వినియోగదారులు వారి బిల్లులను సకాలంలో చెల్లించటం, వారి నగదును నిర్వహించడానికి సాయపడుతుంది.' అని పేర్కొన్నారు.

పేటీఎం 2.3 బిలియన్​ డాలర్ల నిధుల సమీకరణ కోసం పబ్లిక్​ ఇష్యూకు వెళుతున్న క్రమంలో ఈ మార్పులు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్​ ఇష్యూకు రానుంది పేటీఎం. అది నవంబర్​లో అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి:పేటీఎంలో క్యాష్‌బ్యాక్‌ల బొనాంజా- ఇలా చేస్తేనే...

ABOUT THE AUTHOR

...view details