తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ రోజే స్టాక్​ మార్కెట్లో పేటీఎం షేర్స్​ లిస్టింగ్.. ఆరంభ ధర ఎంతంటే?

ప్రముఖ డిజిటల్‌ నగదు బదిలీ సంస్థ పేటీఎం(Paytm IPO) షేర్లు అతి త్వరలో స్టాక్​ మార్కెట్లో నమోదుకానున్నాయి. దీనికోసం ఒక్కో షేరు ధరను రూ.2,150గా కంపెనీ నిర్ణయించింది. రూ.18,300కోట్ల సమీకరణే లక్ష్యంగా పేటీఎం చేపట్టిన ఐపీఓ ఇటీవలే ముగియగా.. 1.89 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది.

paytm
పేటీఎం

By

Published : Nov 12, 2021, 4:06 PM IST

డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవలందించే ప్రముఖ సంస్థ పేటీఎం(paytm ipo) ఒక్కో షేర్ ప్రారంభ ధరను రూ.2,150గా నిర్ణయించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

ఇటీవలే పేటీఎం ఐపీఓ(Paytm IPO date) ముగియగా.. నవంబర్ 18న పేటీఎం షేర్లు స్టాక్​ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశముంది. కంపెనీ మొత్తం విలువను రూ.1.39 లక్షల కోట్లుగా లెక్కగట్టిన పేటీం.. ఒక్కో షేరు ధరను రూ.2,080-2,150 మధ్య నిర్ణయించింది.

పేటీఎం ఐపీఓ హైలెట్స్ ఓసారి గమనిస్తే..

  • రూ.18,300 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టగా.. 1.89 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్(paytm ipo subscription) అయింది.
  • ఐపీఓ ద్వారా రూ.18,300 కోట్ల సమీకరించి.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే అతిపెద్ద ఫిన్​టెక్ కంపెనీగా పేటీఎం అవతరించింది.
  • స్పెయిన్​కు చెందిన 'ఆల్‌ ఫండ్స్' తర్వాత 2021లో రెండో అతిపెద్ద ఐపీఓ ఇదే. మొత్తంగా.. ప్రపంచవ్యాప్తంగా నాలుగో అతిపెద్ద ఐపీఓగా పేటీఎం నిలిచింది.
  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, దేశీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో తమ షేర్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయినట్లు నియంత్రణ సంస్థలకు ఇచ్చిన సమాచారంలో పేటీఎం వెల్లడించింది.
  • ఐపీఓలో సేకరించిన మొత్తం రూ.18,300 కోట్ల నుంచి బుక్​ రన్నింగ్ మేనేజర్లకు(బీఆర్​ల్ఎం) రూ.323.9 కోట్లు(1.8 శాతం) పేటీఎం చెల్లించనుంది. దేశంలో ఇప్పటివరకు జరిగిన ఐపీఓ చెల్లింపుల్లో ఇదొకటి కావడం విశేషం.

తన ఐపీఓ కోసం మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ శాక్స్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్, సిటీ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్‌లను బీఆర్​ఎల్​ఎంగా పేటీఎం నియమించుకుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details