తెలంగాణ

telangana

ETV Bharat / business

Paytm IPO: పేటీఎం ఐపీఓకు సెబీ గ్రీన్​ సిగ్నల్​

పేటీఎం ఐపీఓకు(Paytm IPO news) సెబీ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో వేగంగా లిస్టింగ్​ రావాలనే ఉద్దేశంతో ముందుస్తు షేర్ల అమ్మకాలకు వెళ్లకూడదని పేటీఎం భావిస్తోంది.

Paytm IPO
పేటిఎం ఐపీఓ

By

Published : Oct 22, 2021, 7:00 PM IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా.. పేటీఎం ఇనీషియల్​ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు(Paytm IPO news) మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఐపీఓకి సంబంధించిన వివరాలను గతంలో పేటీఎం మాతృసంస్థ 'వన్‌97 కమ్యూనికేషన్స్‌' మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీకి అందజేయగా తాజాగా సెబీ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు పేర్కొన్నాయి. ఈనెలాఖరు నాటికి మార్కెట్లో ప్రవేశించాలని పేటీఎం భావిస్తోంది. వేగంగా​ లిస్టింగ్‌కు రావాలనే ఉద్దేశంతో ముందస్తు షేర్ల అమ్మకాలకు వెళ్లకూడదని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం.

ఈ ఐపీఓ ద్వారా మొత్తం రూ.16,600 కోట్లు సమీకరించనున్నట్లు పేటీఎం తెలిపింది. వీటిలో తాజా షేర్ల ద్వారా రూ.8,300 కోట్లు సమీకరించనున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద మరో రూ.8,300 కోట్ల విలువ చేసే షేర్లను వాటాదార్లు ఐపీఓలో విక్రయానికి ఉంచనున్నారు.

సెబీ అమోదం లభిస్తే.. దేశంలో అతిపెద్ద ఐపీఓ ఇదే కానుంది. దశాబ్దం క్రితం కోల్‌ ఇండియా ఐపీఓ ద్వారా రూ.15,000 కోట్లను సమీకరించింది. పబ్లిక్‌ ఇష్యూల వైపు చూస్తున్న ఫిన్‌టెక్‌ కంపెనీలకు పేటీఎం ఐపీఓ ఓ మార్గదర్శకంగా నిలవనుంది. మరోవైపు ఆన్‌లైన్ ఆధారిత సేవలకు సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థాగత మదుపర్లు ఆసక్తి కనబరుస్తున్న తరుణంలో ఈ ఐపీఓ రానుండడం గమనార్హం.

ఇదీ చూడండి:ఆరోగ్య బీమాతో.. ఆర్థిక స్వేచ్ఛ!

ABOUT THE AUTHOR

...view details