తెలంగాణ

telangana

ETV Bharat / business

'నూతన ఉద్యోగులకు వేతనమే ప్రాధాన్యం' - YOUTH

కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునే ఉద్యోగార్థులు.. వేతన పెంపునే తమ తొలి ప్రాధాన్యంగా తీసుకుంటున్నారని ఓ సర్వే వెల్లడించింది. 54శాతం మంది వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని నూతన ఉద్యోగాన్ని ఎంచుకుంటున్నట్లు పేర్కొంది.

Pay scale most important factor for freshers: survey
'నూతన ఉద్యోగులకు వేతనమే ప్రాముఖ్యం'

By

Published : Dec 10, 2019, 7:11 AM IST

Updated : Dec 10, 2019, 9:05 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ శాతం నాలుగు దశాబ్దాల రికార్డుకు పెరిగింది. అయితే ప్రతికూల సందర్భంలోనూ.. కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునే యువత పే స్కేల్(వేతనం) గురించే ఆలోచిస్తోందని ఇన్​స్టిట్యూట్ ఆఫ్ క్రోనోస్ అండ్ ఫ్యూచర్ వర్క్​ ప్లేస్ అనే సంస్థ వెల్లడించింది. 54 శాతం మంది నూతన ఉద్యోగానికి దరఖాస్తు చేసే సందర్భంలో ప్రథమ ప్రాధాన్యంగా వేతనాన్నే పరిగణనలోకి తీసుకుంటున్నారని స్పష్టం చేసింది. వయసు పెరిగే కొద్ది డబ్బు చాలా ముఖ్యమైనదనిగా పేర్కొన్నారు.

22­-25 మధ్య వయసున్న ఉద్యోగుల్లో 57 శాతం మంది వేతనం కంటే మరేది ముఖ్యం కాదని తెలిపారు. ఇది 21ఏళ్ల వారి కన్నా ఎక్కువ(49శాతం).

12 దేశాల్లోని యువతపై సర్వే..

భారత్, ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రిటన్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో, నెదర్లాండ్స్​, న్యూజిలాండ్, అమెరికాల్లోని 3400 మంది నూతన ఉద్యోగులపై ఈ పరిశోధన చేసినట్లు సంస్థ వెల్లడించింది.

ఉచిత అల్పాహారం, జిమ్ ఖర్చులు సహా సంప్రదాయంగా వస్తున్న ఆరోగ్య రక్షణ, పదవీ విరమణ ప్రణాళిక, జీవిత బీమా వంటి ప్రయోజనాలపై వయసుతో నిమిత్తం లేకుండా 2-1 నిష్పత్తిలో ఉద్యోగులు ఆసక్తి కలిగి ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

Last Updated : Dec 10, 2019, 9:05 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details