ఇండిగో విమానయాన సంస్థ గురువారం 'ఫ్లెక్స్ పే' అనే సౌకర్యవంతమైన చెల్లింపు పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా ప్రయాణికులు... బుకింగ్ సమయంలో విమాన టికెట్ మొత్తం ఛార్జీలో కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
ఈ పథకం కింద విమాన ప్రయాణికులు మిగిలిన 90 శాతం టికెట్ ఛార్జీని... 'బుకింగ్ తేదీ నుంచి లేదా విమానం బయలుదేరే తేదీకి ముందు 15 రోజుల లోపు' చెల్లించవచ్చని ఇండిగో ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది.
రిఫండ్ ఉండదు..
ఉదాహరణకు ఈ పథకం కింద ఓ ప్రయాణికుడు విమాన టికెట్ ధరలో 10 శాతం చెల్లించి టికెట్ బుకింగ్ చేశాడనుకుందాం. అయితే తరువాత అతను మిగిలిన 90 శాతం చెల్లించకుండానే బుకింగ్‌ను రద్దు చేసుకుంటే... మొదట చెల్లించిన 10 శాతం ఛార్జీని తిరిగి చెల్లించరు.
సాధారణంగా, ప్రయాణికులు విమానం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే... మొత్తం టికెట్ ధరను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒకే సారి అంత మొత్తం చెల్లించనవసరం లేకుండా ఇండిగో ఈ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
ఇదీ చూడండి:స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల డిపాజిట్లు