తెలంగాణ

telangana

ETV Bharat / business

విద్యాసంస్థలకు గుడ్​ న్యూస్​- పేటెంట్ ఫీజుపై 80% రాయితీ - విద్యా సంస్థలు పేటెంట్

పేటెంట్ రిజిస్ట్రేషన్​లకు సంబంధించి (Patent fees in India) కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల్లో భాగంగా.. విద్యాసంస్థలన్నింటికీ పేటెంట్​ రిజిస్ట్రేషన్​ ఫీజును (Patent Registration Fees) 80 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా కొత్త టెక్నాలజీలు, పరిశోధనలకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొంది.

Patent fees educational institutions
పేటెంట్ రిజిస్ట్రేషన్ ఫీ

By

Published : Sep 23, 2021, 5:39 PM IST

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త​ చెప్పింది. (Patent Registration Fees in India) నూతన ఆవిష్కరణలు, కొత్త టెక్నాలజీల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు గానూ.. పేటెంట్ ఫీజులో 80 శాతం రాయితీ (Patent fees in India) ఇవ్వాలని నిర్ణయించింది. ఆత్మనిర్భర్ భారత్​ లక్ష్యాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇంతకు ముందు ఈ విధమైన లబ్ధి ప్రభుత్వాధీనంలోని ప్రత్యేక గుర్తింపు ఉన్న కొన్ని విద్యా సంస్థలకు మాత్రమే ఉండేది. (Patent Registration Fees)

'విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు ఎన్నో రకాల పరిశోధనలు చేస్తుంటాయి. ప్రొఫెసర్లు, విద్యార్థులు ఎంతో మంది అందులో నిరంతరాయంగా కృషి చేసి కొత్త ఆవిష్కరణలు చేస్తుంటారు. అయితే ఇవి వినియోగంలోకి రావాలన్నా, వాణిజ్య పరంగా అందుబాటులోకి రావాలన్నా.. అందుకు పేటెంట్స్​ అవసరం.' అని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ప్రస్తుతం ఉన్న అధిక ఫీజుల వల్ల కొత్త టెక్నాలజీలు పేటెంట్ పొందటం కష్టతరమవుతోందని.. ఫలితంగా ఆ టెక్నాలజీల, ఆవిష్కరణలు మనుగడలోకి రాలేకపోతున్నాయని వివరించింది.

జాప్యం తగ్గేలా మార్పులు...

పేటెంట్ రుసుముల తగ్గింపునకు (Patent Registration Fees in India) సంబంధించి సవరణలతో కూడిన నోటిఫికేషన్​ను కూడా విడుదల చేసింది వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఫీజులతో పాటు పేటెంట్ రిజిస్ట్రేషన్​లో జాప్యాన్ని తగ్గించేలా కూడా మార్పులు చేసినట్లు ఇందులో పేర్కొంది. ఈ సవరణలు సెప్టెంబర్ 21 నుంచే వర్తిస్తాయని స్పష్టం చేసింది.

ఈ నోటిఫికేషన్​లో విద్యాసంస్థల నిర్వచనాన్ని కూడా వివరించింది కేంద్రం. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు లోబడి పని చేస్తున్న వాటిని మాత్రమే గుర్తింపు పొందిన విద్యా సంస్థలుగా పరిగణిస్తామని పేర్కొంది. వీటితో పాటు కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలు నియమించిన ప్రత్యేక యంత్రాంగం గుర్తింపు ఇచ్చిన విద్యా సంస్థలకు కూడా పేటెంట్ ఫీజుల రాయితీని వినియోగించుకోవచ్చని తెలిపింది.

2015లో ఒక ఆవిష్కరణను పరీక్షించి దానికి పేటెంట్ ఇచ్చేందుకు సగటున 72 నెలల సమయం పట్టగా.. ఇప్పుడది 12-30 నెలలకు తగ్గుతుందని పేర్కొంది మంత్రిత్వ శాఖ. ఈ ఏడాది చివరి నాటికి ఇది సాధ్యమవ్వచ్చని తెలిపింది.

ఇదీ చదవండి:ఐఓసీఎల్​లో ఉద్యోగ అవకాశాలు- నెలకు రూ.1.05 లక్షల జీతం!

ABOUT THE AUTHOR

...view details