తెలంగాణ

telangana

By

Published : Feb 19, 2021, 12:13 PM IST

ETV Bharat / business

కరోనాకు పతంజలి 'కొరొనిల్​ టాబ్లెట్​'

కరోనాను ఎదుర్కొనేందుకు పతంజలి సంస్థ కొరొనిల్​ టాబ్లెట్​ను ప్రవేశపెట్టింది. దీనిని దిల్లీలో.. యోగా గురువు బాబా రామ్​దేవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ పాల్గొన్నారు.

ramdev
కొరొనిల్​ టాబ్లెట్​ను ఆవిష్కరించిన పతంజలి

ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి.. కరోనా మహమ్మారిపై రూపొందించిన ఔషధాన్ని శుక్రవారం విడుదల చేసింది. ఈ కొరొనిల్​ టాబ్లెట్​ను దిల్లీలో యోగా గురువు బాబా రామ్​దేవ్​ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు నితిన్​ గడ్కరీ, హర్షవర్ధన్​ హాజరయ్యారు.

"భారత్​లో ఆయుర్వేద రంగం ఏటా రూ.30వేల కోట్ల ఆదాయాన్ని అర్జిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం కొవిడ్​కు ముందు ఏటా ఈ రంగానికి 15-20శాతం ఆర్థిక వృద్ధి ఉండేది. కానీ ఇప్పుడు అది 50-90 శాతానికి పెరిగింది. ప్రజలు ఆయుర్వేదాన్ని స్వాగతించారు అనడానికి ఇదే ఉదాహరణ. ఎగుమతులు, విదేశీ పెట్టుబడుల్లో కూడా వృద్ధి కనపడుతోంది."

-హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

పరిశోధనా పత్రాలు విడుదల

అధ్యయనాలు పూర్తి చేసుకుని.. మార్కెట్​లోకి విడుదల అవుతున్న తొలి కొవిడ్​ ఔషధమని పతంజలి సంస్థ పేర్కొంది. ఈ సందర్భంగా పరిశోధనకు సంబంధించిన శాస్త్రీయ పత్రాలను కూడా విడుదల చేశారు రామ్​దేవ్​.

ఇదీ చదవండి :జల విలయం- 62కు చేరిన మృతులు

ABOUT THE AUTHOR

...view details