తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫిబ్రవరిలో కార్ల విక్రయాలు 18% వృద్ధి - సియామ్ వాహన విక్రయ గణాంకాలు

దేశంలో కార్ల టోకు విక్రయాలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరిలో 2,81,380 ప్యాసింజర్​ వాహనాలు అమ్ముడైనట్లు సియామ్ పేర్కొంది. 2020 ఫిబ్రవరిలో నమోదైన ప్యాసింజర్ వాహన విక్రయాలతో పోలిస్తే ఈ మొత్తం 17.92 శాతం అధికమని తెలిపింది.

Vehicle sales rise huge level in February
ఫిబ్రవరిలో వాహన విక్రయాల జోరు

By

Published : Mar 10, 2021, 7:05 PM IST

దేశంలో వాహనాల అమ్మకాలు కరోనా సంక్షోభం నుంచి తేరుకుని క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్యాసింజర్​ వాహనాల విక్రయాలు 17.92 శాతం పెరిగి.. 2,81,380 యూనిట్లుగా నమోదైనట్లు భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించింది. 2020 ఫిబ్రవరిలో 2,38,622 యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్లు తెలిపింది.

సియామ్ గణాంకాలు ఇలా..

గత నెల ద్విచక్ర వాహన విక్రయాలు 10.2 శాతం పెరిగి.. 14,26,865 యూనిట్లుగా నమోదయ్యాయి. 2020 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 12,94,787గా ఉంది.

మోటార్​ సైకిళ్ల విక్రయాలూ 2021 ఫిబ్రవరిలో 11.47 శాతం పుంజుకున్నాయి. మొత్తం 9,10,323 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020 ఫిబ్రవరిలో 8,16,679 మోటార్​ సైకిళ్లు విక్రయమయ్యాయి.

కేటగిరీల వారీగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 17,35,584 వాహనాలు అమ్ముడయ్యాయి. 2020 ఫిబ్రవరిలో విక్రయమైన 15,74,764 యూనిట్లతో పోలిస్తే ఈ మొత్తం 10.21 శాతం అధికం.

ఇదీ చదవండి:2020-21లో ఇళ్ల విక్రయాలు 34% డౌన్!

ABOUT THE AUTHOR

...view details