కరోనా సంక్షోభం నుంచి దేశీయ వాహన రంగం నెమ్మదిగా తేరుకుంటోంది. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ఆగస్టులో 14.16శాతం పెరిగాయి. భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్) గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.
ఈ గణాంకాల ప్రకారం ఆగస్టులో 2,15,916 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2019 ఆగస్టులో ఈ సంఖ్య 1,89,129గా ఉండటం గమనార్హం.
మోటార్ సైకిళ్ల విక్రయాలు ఆగస్టులో భారీగా 10.13 శాతం పెరిగాయి. గత నెల మొత్తం 10,32,476 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 ఆగస్టులో 9,37,486 మోటార్ సైకిళ్ల విక్రయాలు నమోదయ్యాయి.
స్కూటార్ల విక్రయాలు మాత్రం ఆగస్టులో 12.3 శాతం తగ్గి.. 4,56,868 యూనిట్లుగా పరిమితమయ్యాయి. గత ఏడాది ఆగస్టులో 5,20,898 యూనిట్లు అమ్ముడైనట్లు సియామ్ తెలిపింది.
ఇదీ చూడండి:ఆ విమాన సంస్థలో 4,300 ఉద్యోగాలు కట్!