తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రయాణికుల వాహనాల సేల్స్ అదుర్స్​ - వాణిజ్య వాహన అమ్మకాలు

గత డిసెంబర్​లో ప్రయాణికుల వాహన విక్రయాలు దూసుకెళ్లాయి. ఈ మేరకు వాహన డీలర్ల సమాఖ్య(ఫాడా) ప్రకటించింది. ఇది గత డిసెంబర్​తో పోలిస్తే 24శాతం అధికమని తెలిపింది.

fada releases the data about sales
ప్రయాణీకుల వాహనాలు రయ్.. రయ్..

By

Published : Jan 11, 2021, 6:18 PM IST

2020 డిసెంబర్​లో ప్రయాణికుల వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయని వాహన డీలర్ల సమాఖ్య(ఫాడా) నివేదిక తెలిపింది. 2020 డిసెంబర్​లో 2,71,249 యూనిట్లు అమ్ముడయ్యాయని వెల్లడించింది. 2019 డిసెంబర్​తో పోల్చితే ఇది 24శాతం అధికమని వివరించింది.

ద్విచక్ర వాహన విక్రయాలు 2020 డిసెంబర్​లో 11.88 శాతం పెరిగి 14,24,620గా నమోదయ్యాయి.

వాణిజ్య వాహన అమ్మకాలు 13.52శాతం క్షీణించాయి. గత సంవత్సరం 59,497అమ్ముడవ్వగా 2020 డిసెంబర్​లో 51,454 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి.

మూడు చక్రాల వాహన విక్రయాలు సైతం భారీగా(52.75శాతం) పడిపోయాయి. 58,651నుంచి 27,715 కు తగ్గాయి. ఇక ట్రాక్టర్​ల అమ్మకాలు 35.49శాతం పెరిగాయి. అన్ని కేటగిరీలు కలిపి మొత్తంగా వాహన విక్రయాలు 11.01 శాతం పెరిగాయి.

దేశవ్యాప్తంగా ఉన్న రవాణా కార్యాలయాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఫాడా ఈ గణాంకాలను విడుదల చేసింది.

ఇదీ చదవండి:ఐటీ, ఆటో దూకుడు- మార్కెట్ల నయా రికార్డు

ABOUT THE AUTHOR

...view details