ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు నవంబర్‌లో స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే.. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 4.17 శాతం పుంజుకున్నట్లు వాహన డీలర్ల సమాఖ్య 'ఫాడా' ప్రకటించింది. దీపావళి, దంతేరాస్ వంటి పండుగల నేపథ్యంలో గత నెల మొత్తం 2,91,001 యూనిట్లు విక్రయమైనట్లు వెల్లడించింది. 2019 నవంబర్‌లో 2,79,365 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవ్వడం గమనార్హం.
పండుగ డిమాండ్‌తో పెరిగిన కార్ల విక్రయాలు - ,ఫాడా వాహన విక్రయాల డేటా
దేశీయంగా వాహన రిటైల్ విక్రయాలు నవంబర్నూ భారీగా 19.29 శాతం తగ్గాయి. గత నెల మొత్తం 18,27,990 యూనిట్లు విక్రయించినట్లు వాహన డీలర్ల సమాఖ్య 'ఫాడా' ప్రకటించింది. అయితే దీపావళి, దంతేరాస్ వంటి పండుగల నేపథ్యంలో కార్ల విక్రయాలు మాత్రం స్వల్పంగా 4 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
నవంబర్‌లో తగ్గిన వాహన విక్రయాలు
నవంబర్ వాహన రిటైల్ విక్రయాలు ఇలా..
- ద్విచక్రవాహనాల విక్రయాలు గత నెల 21.4 శాతం తగ్గి.. 14,13,378 యూనిట్లుగా నమోదయ్యాయి. 2019 నవంబర్‌లో 17,98,201 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి.
- వాణిజ్య వాహనాల విక్రయాలు నవంబర్‌లో భారీగా 31.22 శాతం పడిపోయాయి. గత నెల 50,113 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2019 నవంబర్‌లో 72,863 వాణిజ్య వాహనాలు విక్రయమవ్వడం గమనార్హం.
- ఈ ఏడాది నవంబర్‌లో 24,185 త్రిచక్ర వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో విక్రయమైన 69,056 యూనిట్లతో పోలిస్తే.. ఇవి 64.98 శాతం తక్కువ.
- ట్రాక్టర్ల విక్రయాలు నవంబర్లోనూ 8.74 శాతం పెరిగాయి. గత నెల మొత్తం 49,313 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 ఇదే సమయంలో 45,462 ట్రాక్టర్లు విక్రయమయ్యాయి.
- అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు నవంబర్‌లో 19.29 శాతం తగ్గాయి. మొత్తం 18,27,990 యూనిట్లు విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో విక్రయమైన వాహనాల సంఖ్య 22,64,947గా ఉంది.
ఇదీ చూడండి:'విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానం భారత్'
Last Updated : Dec 8, 2020, 4:45 PM IST