దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా కేసుల దృష్ట్యా పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తే.. ఆ ప్రభావం కూలీలతో పాటు ముడి సరుకుల మీద కూడా పడుతుందని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) చేపట్టిన సర్వేలో తేలింది. అంతేగాక పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా ప్రభావితం అవుతుందని స్పష్టం చేసింది.
కొవిడ్ కర్య్ఫూ, మైక్రో కంటైన్మెంట్ వంటి పద్ధతులతో పరిశ్రమలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? అనే దానిపై ప్రధానంగా ఈ సర్వే సాగింది. ఈ సర్వేలో వివిధ కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు. వారిలో ఎక్కువమంది పాక్షిక లాక్డౌన్తో లేబర్ కొరత ఏర్పడుతుందని తెలిపారు.
ఇలాంటి పరిణామాలతో పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నట్లు సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ వివరించారు. ఇందులో పాల్గొన్న సీఈఓలలో 56శాతం మంది పారిశ్రామిక ఉత్పత్తి 50శాతంకు కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.