పరోటా, రోటీ.. రుచి వేరేగా ఉన్నా చూడటానికి ఓకేలా ఉంటాయి. తయారీకి దాదాపుగా అంతే సమయం పట్టొచ్చు. అయితే రెండింటిలో పరోటా తినాలంటే మాత్రం మీ జేబుకు కాస్త ఎక్కువ చిల్లు పడొచ్చు. ఇందుకు కారణం జీఎస్‌టీ. రోటీపై 5 శాతం మాత్రమే వస్తు, సేవల పన్ను వేయగా.. పరోటాపై మాత్రం 18 శాతం విధించారు.
ఇలా వర్గీకరణ...
'పరోటా'ను చాప్టర్ హెడ్డింగ్ 2106 కింద వర్గీకరించింది అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) కర్ణాటక. ఈ నిర్ణయం ప్రకారం పరోటా అనేది సాదా చపాతీ లేదా రోటీ కాదు కాబట్టి 18% జీఎస్టీ దానికి వర్తిస్తుందని నిర్ణయించింది. ఐడీ ఫ్రెష్ ఫుడ్ అనే ఆహార ఉత్పత్తుల సంస్థ వేసిన దరఖాస్తుకు స్పందనగా ఈ విషయాన్ని వెల్లడించింది ఏఏఆర్.