సమాచార భద్రత అంశంపై టెలికాం, క్యాబ్ ఆపరేటర్లకు పార్లమెంట్ సంయుక్త కమిటీ నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరు కావాలని రిలయన్స్ జియో, ఎయిర్టెల్, ఓలా, ఉబర్ ప్రతినిధులను ఆదేశించింది. భాజపా ఎంపీ మీనాక్షీ లేఖీ అధ్యక్షతలోని ఈ కమిటీ.. 'వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు 2019'పై సమీక్షిస్తోంది.
నోటీసులోని వివరాల ప్రకారం.. రిలయన్స్ జియో ఇన్ఫోకాం, జియో ప్లాట్ఫాం ప్రతినిధులను నవంబర్ 4న జరిగే విచారణకు వేర్వేరుగా హాజరుకావాలని ప్యానెల్ ఆదేశించింది. ఓలా, ఉబర్ ప్రతినిధులను తర్వాతి రోజు హాజరుకావాల్సిందిగా సూచించింది. అదేవిధంగా ఎయిర్టెల్, ట్రూకాలర్ సంస్థల ప్రతినిధులు నవంబర్ 6న హాజరవ్వాలని స్పష్టం చేసింది.