సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ ఆదాయం, లాభం, పన్ను చెల్లింపులపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ప్రశ్నలు సంధించింది. దేశంలోని ఖాతాదారుల డేటా భద్రత, గోప్యత కోసం.. సంస్థ ఆదాయంలో ఎంత మేరకు ఖర్చు చేస్తున్నారని అడిగింది.
తమ ఆదేశాల మేరకు హాజరైన ఫేస్బుక్ ప్రతినిధిఅంకి దాస్‌ను రెండు గంటల పాటు ప్రశ్నించింది సంయుక్త పార్లమెంటరీ కమిటీ. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలు.. తమ ప్రకటనదారుల వాణిజ్య ప్రయోజనాలు, ఎన్నికల ప్రయోజనాల కోసం తమ ఖాతాదారుల డేటా నుంచి ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోకూడదని సూచించింది.