కరోనా సంక్షోభంతో తీవ్రంగా ప్రభావితమైన అంసంఘటిత కార్మికులు, వలస కూలీలకు మెరుగైన సామాజిక భద్రత కల్పించేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈఎస్ఐ, ఈపీఎఫ్ ప్రయోజనాలు పొందేందుకు ఉన్న కనీస ఉద్యోగుల సంఖ్య, వేతనాల పరిమితిని తొలగించాలనే యోచనలో ఉంది కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్. లాక్డౌన్ వల్ల తీవ్రంగా ప్రభావితమైన వలస కార్మికులకు ఈ పథకాన్ని వర్తించేలావిస్తరించాలని ప్యానెల్ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈఎస్ఐ, ఈపీఎఫ్ పథకాల విస్తరణ అంశంలో కీలక విషయాలు వెల్లడించారు ప్యానెల్ చీఫ్, బీజేడీ ఎంపీ భర్త్రుహరి మహ్తాబ్.
" లాక్డౌన్ తర్వాత అసంఘటిత కార్మికులకు మెరుగైన సామాజిక భద్రత కల్పించాలని ప్యానెల్ సభ్యులు భావిస్తున్నారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ ప్రయోజనాన్ని పొందేందుకు ఉన్న కనీస ఉద్యోగులు, వేతనాల పరిమితిని తొలగించి.. వలస కార్మికులకు వర్తించేలా ఈ రెండు పథకాలను విస్తరించాలని ప్యానెల్‌లోని సభ్యులు అభిప్రాయపడుతున్నారు. కార్మికులకు మెరుగైన సామాజిక భద్రత కల్పించటమే ముఖ్య ఉద్దేశం."
- భర్త్రుహరి మహ్తాబ్, ప్యానెల్ చీఫ్, బీజేడీ ఎంపీ
జులై 15న భేటీ..