తెలంగాణ

telangana

ETV Bharat / business

'స్పుత్నిక్‌ వి' తయారీకి పానేసియా బయోటెక్‌కు అనుమతులు - పానేసియా బయోటెక్​

'స్పుత్నిక్‌ వి' టీకా తయారీకి భారత ఫార్మాసూటికల్‌ దిగ్గజం పానేసియా బయోటెక్‌కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతులు ఇచ్చింది. అయితే.. పానేసియా బయోటెక్‌ తయారు చేసే టీకాను భారత్‌లో వినియోగించడానికి లైసెన్సు తప్పనిసరి పొందాల్సి ఉంది.

Sputnik V
స్పుత్నిక్‌ వి

By

Published : Jul 5, 2021, 6:09 AM IST

Updated : Jul 5, 2021, 7:14 AM IST

రష్యాకు చెందిన 'స్పుత్నిక్‌ వి' టీకా తయారీకి భారత ఫార్మాసూటికల్‌ దిగ్గజం పానేసియా బయోటెక్‌కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతులు ఇచ్చింది. స్పుత్నిక్‌ వి తయారీకి రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌)తో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. పానేసియా బయోటెక్‌ తయారు చేసే టీకాను భారత్‌లో వినియోగించడానికి లైసెన్సు తప్పనిసరి. భారత్‌లో అత్యవసర వినియోగానికి 'స్పుత్నిక్‌ వి'కి ఇప్పటికే ఆమోదం దక్కింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో కంపెనీకి ఉన్న ప్లాంట్లలో తయారైన టీకాలను రష్యాలోని గమలేయా సెంటర్‌కు పంపగా అన్ని నాణ్యతా ప్రమాణాల్లో విజయవంతంగా నెగ్గుకొచ్చాయని కంపెనీ పేర్కొంది. టభారత్​లో స్పుత్నిక్ వి తయారీకి లైసెన్సు పొందినందుకు సంతో షంగా ఉంది. మేక్ ఇన్ ఇండియా టీకాలకు ఊతమిచ్చేందుకు వేగవంతమైన అనుమతులు ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు' అని కంపెనీ ఎండీ డాక్టర్ రాజేశ్ జైన్ పేర్కొన్నారు.

Last Updated : Jul 5, 2021, 7:14 AM IST

ABOUT THE AUTHOR

...view details