తెలంగాణ

telangana

ETV Bharat / business

పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి ఈ నెల 31 చివరి గడువు - pan aadhar link news

ఆధార్​కార్డుతో పాన్​కార్డు అనుసంధానం తప్పనిసరని ఆదాయపు పన్నుశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. మార్చి 31 వరకు తుది గడువు ఇచ్చింది. ఈ లోపు అనుసంధానం చేయకపోతే పాన్​కార్డు పనిచేయదని తెల్చిచెప్పింది. ఒకవేళ మీరు ఇంకా ఆధార్​-పాన్ అనుసంధానం చేసుకోకపోతే ఎలా చేయాలో తెలుసుకోండి.

pan-aadhar linking
పాన్‌-ఆధార్‌ అనుసంధానించుకున్నారా?

By

Published : Mar 17, 2020, 8:03 AM IST

పాన్‌ కార్డు వివరాలను ఆధార్‌ కార్డుతో అనుసంధానించుకోవడం తప్పనిసరని ఆదాయపుపన్ను విభాగం పునరుద్ఘాటించింది. ఇందుకు మార్చి 31 తుది గడువు అని సోమవారం స్పష్టంచేసింది. గడువు లోపల ఆధార్‌తో అనుసంధానించుకోని పాన్‌ కార్డు పనిచేయదని గత నెలలోనే ఆదాయపుపన్ను విభాగం పేర్కొన్న సంగతి తెలిసింది. ‘‘బయోమెట్రిక్‌ ఆధార్‌ ధ్రువీకరణ, ఎన్‌ఎస్‌డీఎల్‌, యూటీఐటీఎస్‌ఎల్‌ పాన్‌ సేవా కేంద్రాల ద్వారా కూడా మీరు అనుసంధానించుకోవచ్చు’’ అని సోమవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో ఆదాయపుపన్ను విభాగం స్పష్టంచేసింది. ఈ మేరకు తన ట్విటర్‌ హ్యాండిల్‌లో ఓ వీడియో సందేశం ఉంచింది. రెండు మార్గాల్లో అనుసంధానం ప్రక్రియను పూర్తిచేయవచ్చని అందులో పేర్కొంది. అవి..

  1. UIDPAN<SPACE>12digit Aadhaar><space>10digitPAN> అన్న సందేశాన్ని 567678, 56161 నంబర్లలో ఏదో ఒకదానికి పంపాలి.
  2. www.incometaxindiaefiling.gov.in లోకి వెళ్లి అనుసంధానించుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details