తెలంగాణ

telangana

ETV Bharat / business

covaxin: భారత్​ బయోటెక్​తో జీసీవీసీ ఒప్పందం - covaccine hester

భారత్​ బయోటెక్​- గుజరాత్​ కొవిడ్ వ్యాక్సిన్​ కన్సార్టియం​(జీసీవీసీ) మధ్య గురువారం అవగాహన ఒప్పందం కుదిరింది. కొవాగ్జిన్​ టీకాకు సంబంధించిన ఔషధాల పదార్థాలను కన్సార్టియం తయారు చేయనుంది.

Gujarat Covid Vaccine Consortium:
భారత్​ బయోటెక్​

By

Published : May 27, 2021, 10:42 PM IST

కొవాగ్జిన్​కు సంబంధించిన ఔషధాల తయారీ కాంట్రాక్టు కోసం భారత్ బయోటెక్- జీసీవీసీ(గుజరాత్​ కొవిడ్​ వ్యాక్సిన్​ కన్సార్టియం) మధ్య గురువారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని హెస్టర్ బయోసైన్స్ వెల్లడించింది.

గుజరాత్ కొవిడ్​ వ్యాక్సిన్​ కన్సార్టియం​లో గుజరాత్​ బయోటెక్నాలజీ రీసెర్చ్​ సెంటర్​ (జీబీఆర్​సీ), హెస్టర్​ బయోసైన్సెస్​, ఓమ్నీ బయోటెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్​లు భాగంగా ఉన్నాయి.

ఒప్పందం ప్రకారం ఔషధాల తయారీకి చెందిన సాంకేతికతను భారత్ బయోటెక్.. జీసీవీసీతో పంచుకుంటుంది. ఈ ప్రణాళికను జీబీఆర్సీ పర్యవేక్షిస్తుంది. పని పుర్తి చేయడం కోసం తమ గుజరాత్​ ప్లాంటులో అన్ని సదుపాయాలను హెస్టర్ బయోసైన్స్ ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం రూ. 40కోట్లను వెచ్చించనుంది. ఓమ్నిబ్రిక్స్.. సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తుంది.

అన్ని ప్రణాళికాబద్ధంగా జరిగితే ఈ ఆగస్టు నాటికి ఔషధ పదార్థం తయారీ పూర్తి అయ్యి భారత్ బయోటెక్​కు తిరిగి అందివ్వనుంది హెస్టర్ బయోసైన్సెస్.

ఇదీ చదవండి:అంకురాలకు కరోనా కష్టాలు- వెంటాడుతున్న నిధుల లేమి!

ABOUT THE AUTHOR

...view details