సొంత ఇల్లు ఉన్నప్పటికీ, ఇతర కారణాల చేత అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లయితే ఆదాయపు పన్ను తగ్గించుకునేందుకుగాను హెచ్ఆర్ఏ, గృహ రుణం రెండింటినీ క్లెయిమ్ చేయవచ్చు. జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వం మొత్తం గృహ రుణ మినహాయింపు పరిమితిని ఏడాదికి రూ.1.5 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచింది. రూ.45 లక్షల లోపు విలువైన గృహాలకు ఇది వర్తిస్తుంది. ఈ అదనపు మినహాయింపు మార్చి 31, 2020 వరకు తీసుకున్న కొత్త గృహ రుణాలపై లభించనుంది.
హెచ్ఆర్ఏ, గృహ రుణం రెండింటినీ క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. కానీ అన్ని సందర్భాల్లోనూ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇది వారు చెప్పే కారణంపై ఆధారపడి ఉంటుంది. ఆదాయపు పన్ను అధికారులు మీరు అందించిన వివరాలను పరిశీలిస్తే, మీరు ఇల్లు కలిగి ఉన్న చోట నివసించకపోవడానికి తగిన కారణం ఉండాలి.
క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండే కొన్ని సందర్భాలు..
సొంతింటిపై రుణం చెల్లిస్తూ ఉద్యోగం, ఇతర కారణాల రీత్యా వేరే నగరంలో పనిచేస్తూ అక్కడ అద్దె చెల్లిస్తుంటే, రెండింటినీ క్లెయిమ్ చేసుకోవచ్చు.