ప్యాసింజర్ వాహనాల విక్రయాలు సెప్టెంబర్‌లో మోస్తరుగా పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే.. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 9.81 శాతం పుంజుకున్నట్లు వాహన డీలర్ల సమాఖ్య 'ఫాడా' ప్రకటించింది. గత నెల మొత్తం 1,95,665 యూనిట్లు విక్రయమైనట్లు వెల్లడించింది. 2019 సెప్టెంబర్‌లో ప్యాసింజర్ వాహనాల విక్రయాల సంఖ్య 1,78,189గా ఉన్నట్లు వివరించింది.
'సెప్టెంబర్‌లో వాహన విక్రయాలు 10.24% డీలా'
సెప్టెంబర్‌లోనూ వాహనాల విక్రయాలు భారీగా తగ్గాయి. అన్ని విభాగాల్లో కలిపి గత నెల 13,44,866 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయని.. వాహన డీలర్ల సామాఖ్య ఫాడా వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే.. ఈ విక్రయాలు 10.24 శాతం తక్కువని తెలిపింది. ప్యాసింజర్ వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలు మాత్రం సెప్టెంబర్‌లో సానుకూల వృద్ధిని నమోదు చేసినట్లు పేర్కొంది.
సెప్టెంబర్‌లోనూ వాహన విక్రయాలు డీలా
'ఫాడా' ప్రకారం సెప్టెంబర్‌లో వాహన విక్రయాలు ఇలా..
- ద్విచక్రవాహనాల విక్రయాలు గత నెల 12.62 శాతం తగ్గి.. 10,16,977 యూనిట్లుగా నమోదయ్యాయి. 2019 సెప్టెంబర్‌లో 11,63,918 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి.
- వాణిజ్య వాహనాల విక్రయాలు సెప్టెంబర్‌లో భారీగా 33.65 పడిపోయాయి. గత నెల 39,600 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2019 సెప్టెంబర్‌లో 59,683 వాణిజ్య వాహనాలు విక్రయమవ్వడం గమనార్హం.
- ఈ ఏడాది సెప్టెంబర్‌లో 24,060 త్రిచక్ర వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది సెప్టెబర్‌లో విక్రయమైన 58,485 యూనిట్లతో పోలిస్తే.. ఇవి 58.86 శాతం తక్కువ.
- ట్రాక్టర్ల విక్రయాలు సెప్టెంబర్‌లో భారీగా 80.59 శాతం పెరిగాయి. మొత్తం 68,564 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ట్రాక్టర్ల విక్రయాలు 38,008 యూనిట్లుగా ఉన్నాయి.
- అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో 10.24 శాతం తగ్గాయి. మొత్తం 13,44,866 యూనిట్లు విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో విక్రయమైన వాహనాల సంఖ్య 14,98,283గా ఉంది.